Tuesday, February 4, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిముఖ్యమంత్రిని కలిసిన బీసీ ఉద్యోగులు

ముఖ్యమంత్రిని కలిసిన బీసీ ఉద్యోగులు

విశాలాంధ్ర -ధర్మవరం : విజయవాడలోని ముఖ్యమంత్రి చాంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీ ఉద్యోగస్తులు కలిశారు. ఈ సందర్భంగా బీసీ ఉద్యోగుల సమస్యల మీద ముఖ్యంగా చేనేత వస్త్ర వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యల మీద వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం స్పందించిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ త్వరలోనే వస్త్ర వ్యాపారులు పడుతున్న ఇబ్బందుల మీద కమిటీలు నియమించి విధివిధానాలను రూపొందిస్తారని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా నాగరాజు, ధర్మవరం వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షులు గిర్రాజ రవి, నీలూరి శ్రీనివాసులు, శశిధర్, హేమంతు, రమణ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు