Friday, February 28, 2025
Homeజిల్లాలుఅనంతపురంబి సి సబ్సిడీ రుణాలను గ్రామసభలో ఎంపిక చేయాలి

బి సి సబ్సిడీ రుణాలను గ్రామసభలో ఎంపిక చేయాలి

జిల్లా సహాయ కార్యదర్శి చిరుతల మల్లికార్జున

విశాలాంధ్ర -అనంతపురం : బి సి సబ్సిడీ రుణాలను గ్రామసభలు ఏర్పాటుచేసి ఎంపిక చేయాలని జిల్లా సహాయ కార్యదర్శి చిరుతల మల్లికార్జున డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక బీసీ కార్పొరేషన్ కార్యాలయం ముందు బీసీ రుణాలు అందరికీ అందేలా చూడాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో చేతి వృత్తిదారుల సమాఖ్య జిల్లా కార్యదర్శి సివి హరికృష్ణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా ముఖ్య అతిథులు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి చిరుతల మల్లికార్జున ఏపీ చేతి వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వక అధ్యక్షులు సి లింగమయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాజకీయ జోక్యం వలన బీసీ సబ్సిడీ రుణాలు అర్హులైన వారికి అందడం లేదన్నారు. బీసీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలు గ్రామసభలు ఏర్పాటు చేసి ఎంపిక చేయాలని అప్పుడే లబ్ధిదారికి లోన్ అందుతుంది సీఎం చంద్రబాబునాయుడు మంచి ఉద్దేశంతో బీసీ సబ్సిడీ రుణాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసిందన్నారు. రాజకీయ జోక్యం చేసుకొని సబ్సిడీ లోన్లు నీరుగా అరుస్తున్నాయి ఇది సరైంది కాదని హెచ్చరించారు. కార్పొరేషన్ దగ్గర బీసీ సబ్సిడీ రుణాలు అందరికీ అందించాలని ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. అనంతరం బీసీ కార్పొరేషన్ ఈడీ సుబ్రహ్మణ్యం కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి రామకృష్ణ,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రాజేష్ గౌడ్, చేతి వృత్తిదారుల సమాఖ్య జిల్లా అధ్యక్షులు సి నాగప్ప, గిరిజన సమాఖ్య రాష్ట్ర నాయకులు రామాంజనేయులు, చేతి వృత్తిదారుల సమాఖ్య నగర అధ్యక్షులు కార్యదర్శి భూషణ, వవీ రాంజి, గౌరవ అధ్యక్షులు ఈశ్వరమ్మ, యువజన సమాఖ్య జిల్లా నాయకులు ధను, నాయి బ్రాహ్మణ వృత్తి దారుల సమాఖ్య నగర అధ్యక్షులు గోవిందరాజులు, గీత కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి రఘు, రైతు సంఘం నాయకులు రామకృష్ణ భాష వెంకట్ రాముడు, నారాయణస్వామి, శీవ,ఆదినారాయణ, దుర్గాప్రసాద్, సిపిఐ నగర కార్యదర్శి అలిపిర తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు