Friday, May 23, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి

కరోనా లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందాలి..

ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్. మాధవి
విశాలాంధ్ర ధర్మవరం:: కరోనా పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని, కరోనా లక్షణాలు అగుపిస్తే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందాలి అని ప్రభుత్వాసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ మాధవి తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు పలు విషయాలను వారు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జన సమూహము, గుంపులు గుంపులుగా ఉండు ప్రదేశాలలో తప్పనిసరిగా మాస్కు ధరించాలని తెలిపారు. అదేవిధంగా ఫంక్షన్లో, సమావేశాలు, పార్టీలు సాధ్యమైనంత వరకు తగ్గించు కుంటూ కరోనా నిబంధనలు పాటిస్తే మంచిది అని తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ తదితర ప్రదేశాల యందు తప్పనిసరిగా మాస్కు ధరించాలని తెలిపారు. 60 సంవత్సరాలు పైబడిన వారు, అదేవిధంగా గర్భవతులు ఇంట్లోనే ఉండాలని, బయటకు ఎటువంటి పరిస్థితుల్లో రాకూడదని తెలిపారు. అంతేకాకుండా వ్యక్తిగత పరిశుభ్రత కూడా తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. జ్వరము, గొంతు నొప్పి, వాసన తెలియకపోవడం, దగ్గు,రుచి తెలియకపోవడం, ఒళ్ళు నొప్పులు, ముక్కు దిబ్బడ , వాంతులు కావడం కరోనా లక్షణాలు అని తెలిపారు. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు వెనివెంటనే ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందుటకు ఒక ప్రత్యేకమైన వార్డును కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తే ఎటువంటి అనారోగ్యాలు రావు అని తెలిపారు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ప్రమాదం అని తెలిపారు. ప్రజలందరూ కరోనా విషయంలో భయాందోళన చందనవసరం లేదని, నిబంధనలు పాటించాలన్నారు. అనారోగ్యంగా ఉన్నవారు బయటికి తిరిగితే సులభంగా కరోనా వ్యాధి వచ్చే అవకాశం ఉంది అని తెలిపారు. గుంపులలో ఉండడం చేయరాదని తెలిపారు. కావున ప్రజలందరూ కూడా ప్రభుత్వం తెలిపిన మేరకు కరోనా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వాటిపై అవగాహన తప్పనిసరిగా చేసుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు