-జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారుల పేర్ల మీద నకిలీ అకౌంట్ లు సృష్టి
: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర- అనంతపురం : సోషల్ మీడియాలో జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారుల పేర్ల మీద నకిలీ అకౌంట్ లు సృష్టించి.. నకిలీ అకౌంట్లు, ఫోన్ల ద్వారా డబ్బులు వసూలుకు గుర్తు తెలియని వ్యక్తులు పాల్పడుతున్నారని, నకిలీ అకౌంట్ లపై సహ ఉద్యోగులు, ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ సూచించారు. సహ ఉద్యోగులైనా, తెలిసినవారైనా నిర్ధారించుకోకుండా ఎలాంటి డబ్బులు పంపరాదన్నారు. సోషల్ మీడియాలో జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారుల పేర్ల మీద నకిలీ అకౌంట్ లు సృష్టించి డబ్బులు అడుగుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, జిల్లాలో ఒక మున్సిపల్ కమిషనర్, ఒక తహసిల్దార్, ఇతర ఉన్నతాధికారుల నకిలీ అకౌంట్ లను సోషల్ మీడియాలో సృష్టించి డబ్బులు కావాలని అడగడం జరిగిందన్నారు. ఈ విషయమై ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతనే డబ్బులు పంపాలని సూచించారు. తెలిసినవారైనా, సహ ఉద్యోగులైన మెసేజ్ లు వచ్చిన వెంటనే డబ్బులు పంపరాదని, వారితో ఫోన్లో మాట్లాడి నిర్ధారించుకోవాలని, నకిలీ అకౌంట్ల విషయమై తమ పొరుగు వారికి కూడా తెలియజేయాలన్నారు. ఎవరికైనా సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్ల నుంచి మెసేజ్ లు వచ్చిన వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు. పలు సంఘటనలు జరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు.