గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు
మామూళ్ళ మత్తులో సంబంధిత అధికారులు
విశాలాంధ్ర -వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలంలోఉన్న బెల్ట్ షాపుల పైన చర్యలు తీసుకోవాల్చిచిన సంబంధిత అధికారులే మామూళ్ళ మత్తులో ఉంటే మరి బెల్ట్ షాపులు తీసేది ఎవరని మండలంలోని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. వివరాల్లోకి వెళితే మండలంలో పోకూరు, కళవల్ల, వలేటివారిపాలెం గ్రామాలలో మూడు మధ్యం దుకాణాలు ఉన్నాయి.అయితే మండలంలో 21 గ్రామపంచాయతీలు ఉండగా .
అందులో సుమారు 36 గ్రామాలు ఉన్నాయి.ప్రతి గ్రామంలో 5 నుండి 10 బెల్ట్ షాపులు నడుపుతున్నారు.ఈ బెల్ట్ షాపులకు వైన్ షాపుల నుండి వారే తీసుకొని వెళ్లి ఇస్తారు. అయితే ఒక బాటిల్ పైన 20 నుండి 30 రూపాయలు అధికంగా వసూలు చేస్తారు.బెల్ట్ షాపువారు మరో 20 రూపాయలు పెంచి మొత్తం 40నుండి 50 రూపాయలు అధికంగా అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయంపై ఎక్సైజ్ అధికారులకు ఎవరైనా గ్రామస్తులు తెలియజేస్తే వెంటనే అధికారుల నుండి వైన్ షాపు యజమానికి ఫోన్ పోతుంది. అంటే దీన్ని బట్టి ఎక్సైజ్ అధికారులకు, బెల్ట్ షాపు నిర్వాహకులకు ఎంతటి అనుబంధం ఉందో వారి వద్ద నుంచి వీరు ఎంత మాత్రం మామూలు అందుతున్నాయో అర్ధం అవుతుంది.పగలంతా కష్టపడి సాయంత్రం మధ్యం పుచ్చుకొనే అలవాటు ఉన్న వారు ఒక కోటర్ పై 50రూపాయలు అధికంగా చెల్లించి కొంటున్నారు. కూలి చేసుకొని సంపాదించేవారి నుండి అధిక మొత్తంలో సొమ్ము చేసుకుంటున్న ఇది ఏది పట్టనట్లు నిమ్మకు నిరేత్తినట్లు వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులపై తీవ్రస్థాయిలో విమర్శలు కుమ్మరిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతస్థాయి అధికారులు చర్యలు తీసుకొని బెల్ట్ షాపులను అదుపు చేసి మధ్యం నియంత్రణను అరికట్టాలని మండలంలోని గ్రామస్తులు కోరుకుంటున్నారు.