Saturday, February 15, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మవరం పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ

ధర్మవరం పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ

విశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం పట్టణంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో, హిందూ స్మశాన వాటికలో సిసి రోడ్డు,సీసీ కలవల్ నిర్మాణం, ముస్లిమ్స్ స్మశాన వాటికలో జంగల్ క్లియరెన్స్ , మట్టితో చదును చేసే పనులు మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ అభివృద్ధి కార్యక్రమాలకు మొత్తం 1.583 కోట్ల రూపాయల నిధులు కేటాయించబడ్డాయి అని,ఈ కార్యక్రమాల ప్రారంభంలో పాల్గొని, వాటి ప్రాముఖ్యతను వివరించారు. నిఈ కార్యక్రమాలు పట్టణంలో అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరచడమే కాక, ప్రజల జీవన ప్రమాణాలను కూడా పెంచుతాయనిు చెప్పారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో వివిధ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. మంత్రికి స్థానిక ప్రజలు,పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భూమి పూజ తరువాత, కార్యాలయ ప్రాంగణంలో జరిగిన సభలో, మంత్రి పట్టణం అభివృద్ధి పై ప్రత్యేకంగా చర్చించారు. నిమా ప్రభుత్వ దృష్టిలో ప్రతి గ్రామం, పట్టణం అభివృద్ధి చెందడం ముఖ్యమైనది అని, ఈ అభివృద్ధి కార్యక్రమాలు సమాజంలో శాంతిని, అభివృద్ధిని పెంచుతాయిు అని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు