Friday, February 21, 2025
Homeఆంధ్రప్రదేశ్బాతుల‌కూ బ‌ర్డ్ ఫ్లూ..

బాతుల‌కూ బ‌ర్డ్ ఫ్లూ..

క‌ర్నూలు నగరంలో బాతుల‌కు బ‌ర్డ్ ఫ్లూ వెలుగు చూసింది.. స్థానిక సంకల్ బాగ్ నందు ఓ వ్యక్తి 25 బాతులు ఇంట్లో పెంచుకుంటున్నారు. గత మూడు రోజుల్లో 25 బాతులలో 15 బాతులు చనిపోవడంతో వాటిని పరీక్షించారు. వైద్యుల పరీక్షలో బాతులకు బర్డ్స్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ కావడంతో.. ఎన్ ఆర్ పేట ఏరియాను జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అధికారులు రెడ్ జోన్ గా ప్రకటించారు. బాతులను పెంచుకుంటున్న వ్యక్తిని ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా స్వీయ గృహ నిర్బంధము లో ఉంచారు. ప్రస్తుతం ఎన్ ఆర్ పేట పరిధిలో చికెన్, కోడిగుడ్ల అమ్మకాలను దుకాణాలలో తాత్కాలికంగా నిలుపుదల చేశారు.

తెలంగాణ‌కు కోళ్ల ర‌వాణా బంద్ ..

బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుండడంతో ఏపీ, తెలంగాణ పరిధిలోని కోళ్ల రవాణా తత్కాలికంగా నిలిపివేశారు. ఇందుకోసం కర్నూల్ నగర పరిధిలోని పంచలింగాల చెక్పోస్ట్ వద్ద ప్రత్యేకంగా చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేశారు. తెలంగాణ నుంచి రవాణా అవుతున్న కోళ్లను, కోడిగుడ్ల వాహనాలను పోలీసులు, పశువర్ధక శాఖ అధికారులు వెనక్కి పంపుతున్నారు. సాధారణంగా కర్నూల్ నగరం కు తెలంగాణ జిల్లా పరిధిలోని గద్వాల, అల్లంపూర్, శాంతినగర్, ఎర్రవల్లి, ఐజ, ఉండవల్లి, చుట్టు పరిసర ప్రాంతాల నుంచి కోళ్లు రవాణా అవుతుంది. కర్నూల్ నగరంలోని కోళ్లు మాంస విక్రయ దుకాణాల్లో 200 నుంచి 300 కేజీల వరకు విక్రయిస్తారు. ఈ క్రమంలో సమీపంలోని తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున వీటిని దిగిమతి చేసుకుంటారు. అయితే బడ్డు ఫ్లూ కారణంగా వీటిని తాత్కాలికంగా నిలిపివేయడంతో.. కోళ్ల పెంపకం పరిశ్రమ దారులకు తీవ్ర నష్టం వాటిల్లని ఉందని వాపోతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు