విశాలాంధ్ర-కవిటి:ఘనంగా హోమియోపతి వైద్య పితామహుడు క్రిస్టియన్ ఫెడరిక్ శామ్యూల్ హనీమూన్270 జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. జగతి శివాలయం ఆవరణంలో ఉన్న క్రిస్టియన్ ఫెడరిక్ శామ్యూల్ హనీమూన్ విగ్రహానికి సోంపేట ఎంపీపీ, ప్రముఖ హోమియో వైద్యులు నిమ్మన దాసు, కవిటి వైస్ ఎంపీపీ పూడి నేతాజీ, స్థానిక సర్పంచ్ పూడి వరప్రసాద్ తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సోంపేట ఎంపీపీ డాక్టర్ ఎన్ దాస్ మాట్లాడుతూ హోమియో హానికరం లేని వైద్య విధానంమని తెలిపారు. హోమియోను దేశీయ వైద్యంగా భావిస్తారని దీర్ఘకాలిక వ్యాధులే కాదు కాలానుగుణంగా జబ్బులను సైతం నేటిగా నాణ్యతగా పనిచేసే హోమియో వైద్యం అని తెలిపారు.పసిపిల్లల ప్రాణాలను రక్షణ కవచంగా నిలిచిందన్నారు.హోమియో మందులను ఎటువంటి దుష్ప్రభావం లేకుండా ధైర్యంగా వాడవ వచ్చునని, అల్లోపతి మందులు తింటూనే హోమియోపతి మందులు కూడా వాడవచ్చు అన్నారు.ఈ కార్యక్రమంలో హోమియో వైద్యులు దుర్గాప్రసాద్ పట్నాయక్, అనురాధ, సుబ్బారెడ్డి,గోవింద్,గ్రామస్తులు భావన సీతారామమూర్తి, పూడి వెంకటేశం, పూడి హరి నారాయణ, దిక్కల బాబురావు, భావన నారాయణమూర్తి, తమరాల హరినాథ్, పిరియా జోగయ్య, పూడి వంశీ, భావన సత్యం,బోర్ర హరి,బోర్ర బాలరాజు, గంతి శ్రీనివాసులు, బార్ల జోగారావు, సమల్లా పద్మనాభం,గుడియా సంతోష్, లమ్మత వేణు,ముద్దపు తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.