విశాలాంధ్ర -యస్ .రాయవరం : అనకాపల్లి జిల్లా యస్ .రాయవరం మండలం వైసీపీ మండల అధ్యక్షులు ఇన్ చార్జ్ ఎంపిపి బొలిశెట్టి గోవిందరావు వైసీపీ కి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …వైయస్సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు వైసీపీ కోసం పని చేస్తున్నట్లు తెలిపారు .అధికారంలో ఉన్న సమయంలో చాలా ఇబ్బందులు పడ్డామని ఇప్పుడు అధికారం లేకపోయినా పార్టీ కోసం నిరంతరము పనిచేస్తున్నామని అన్నారు. తమ సమస్యలను అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని ప్రయత్నం చేస్తున్న కలవడానికి కుదరడం లేదని అన్నారు అందువల్ల మండల పార్టీ అధ్యక్షుడు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.