జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అసోసియేట్ కార్యదర్శి శెట్టిపి జయ చంద్రారెడ్డి
విశాలాంధ్ర – ధర్మవరం : రాష్ట్ర స్థాయిలో ఆగస్టు 24వ తేదీ తేదీ తేదీ నుండి 27 తేదీ వరకు తిరుపతి నగరంలో జరిగే అమరావతి 2026 బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే శ్రీ సత్య సాయి జిల్లా బాస్కెట్బాల్ బాల బాలికల జట్ల నందు బాలుర విభాగంలో ధర్మవరం పట్టణానికి చెందిన లక్ష్మీ నరసింహ,ఎం కార్తీక్ నాయక్, గౌతమ్, కుమార్, ఆసిఫ్, అశోక్, షేక్, సైఫ్, బాలికల విభాగంలో యశస్విని, అలేఖ్య, వైష్ణవి, మన్విత, ప్రియదీప్తి, ధర్మవరం పట్టణానికి చెందిన 12 మంది మంది బాస్కెట్బాల్ క్రీడాకారులు జిల్లా జట్టుకు ఎంపిక కావడం గర్వ కారణమని జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అసోసియేట్ సెక్రటరీ, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రా రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆగస్టు 5 తేదీ నెల నందు ధర్మవరం పట్టణంలో జరిగిన సెలక్షన్స్ నందు వీరు ప్రతిభా చూపి జిల్లా జట్లకు ఎంపికయ్యారు అని తెలిపారు.. వీరి ఎంపిక పట్ల , ధర్మాంబా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మేడాపురం రామి రెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదయ తుల్లా, హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయిలో స్థాయిలో వీరు రాణించి ధర్మవరం పట్టణమునకు పేరు ప్రతిష్టలు తేవాలని వారు ఆకాంక్షించారు..ఎంపికైన క్రీడాకారులు ఆదివారం రోజున బయలుదేరి తిరుపతికి వెళ్లారు అని తెలిపారు.
రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో బాల బాలికలు ఎంపిక
- Advertisement -
RELATED ARTICLES


