Homeఆంధ్రప్రదేశ్స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండి

స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండి

- Advertisement -

స్మార్ట్ మీటర్లు తీసుకుని మీ ఇంటికి వస్తే వారి ముందే బద్దలు కొట్టండి

ఆగస్టు 5వ తేదీన జరిగే ఆందోళనలో భాగస్వామ్యలు కండి

సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపు

రాజమహేంద్రవరం జులై 29 :
కూటమి ప్రభుత్వం ప్రమాదకరమైన స్మార్ట్ మీటర్లను వెంటనే ఆపాలని ప్రజలను నడ్డి విరిచే విద్యుత్ బారాలను తగ్గించాలని కోరుతూ ఆగస్టు 5వ తేదీన జరిగే ఆందోళనలో ప్రజలు భాగస్వామ్యలు కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు

మంగళవారం ఉదయం స్థానిక కూరగాయల మార్కెట్లో ఆగస్టు 6 7 తేదీలలో జరుగుతున్న సిపిఐ 26వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ ప్రచార ఆందోళన నిర్వహించారు

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మధు మాట్లాడుతూ మోడీ ఆదేశాలకు లొంగి గత వైసిపి ప్రభుత్వం అదాని కంపెనీ నుండి సేకిల సంస్థ ద్వారా 7వేల మెగావాట్ల 25 సంవత్సరాల పాటు సోలార్ విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నారని గత ప్రభుత్వానికి రూ 17 50 కోట్లు లంచాలు ఇచ్చి ఆ ఒప్పందం చేసుకున్నారని దానిపై ఆనాడు నేటి ఆర్థిక మంత్రి
పయ్యావుల కేశవ్ గతంలో హైకోర్టులో కేసు వేశారని కానీ అదే ఒప్పందాన్ని నేడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొనసాగిస్తుండడం దారుణం అన్నారు ఆనాడు లోకేష్ స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టమని చెప్పారని నేడు ప్రజలు స్మార్ట్ మీటర్లతో మీ ఇంటికి వస్తే బద్దలు కొట్టాలని మధు డిమాండ్ చేశారు పెట్టిన మీటర్లను ప్రజలు తొలగించాలని సర్దుబాటు చార్జీల విధానమే రద్దు చేయాలని అదనపు భారాలను తగ్గించాలని మధు కోరారు గతంలో చెత్త పన్నుపై ప్రజలందరూ పోరాటం చేయడంతో రద్దయిందని వ్యవసాయ పంప్ సెట్ మీటర్లకు కూడా ఆగాయని ఆయన గుర్తు చేశారు పశ్చిమబెంగాల్ తో సహా అనేక రాష్ట్రాలలో స్మార్ట్ మీటర్లు ప్రజా ఉద్యమాలతో అడ్డుకున్నారని అందుకనే ఈ 5న జరిగే ఆందోళనకు మీరు పెద్ద ఎత్తున తరలిరావాలని మధు పిలుపునిచ్చారు

ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జట్లు లేబర్ యూనియన్ అధ్యక్షులు కే రాంబాబు, నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శి పి లావణ్య, సీపీఐ నగర కార్యవర్గ సభ్యులు చింతలపూడి సునీల్ కూరగాయలు సెక్షన్ అధ్యక్షులు సత్యనారాయణ, కార్యదర్శి రాజు, అధికార బాడీ సభ్యులు దేవుడు బాబు, వెంకట్రావు, బాలకృష్ణ, జట్ల సంఘం కమిటీ నాయకులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు