Homeతెలంగాణగుర్తుతెలియని యువకుని దారుణ హత్య

గుర్తుతెలియని యువకుని దారుణ హత్య

- Advertisement -

సంఘటన స్థలాన్ని సందర్శించిన ఏసీపీ
లక్ష్మీనారాయణ

విశాలాంధ్ర -కొత్తూరు: గుర్తుతెలియని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కొత్తూరు మండలం, తీగపూర్ పంచాయతీ శివారు, డ్రీమ్ మిడాస్ వెంచర్లో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. తీగాపూర్ శివారులో హత్య జరిగినట్లు సమాచారం అందడంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏసిపి లక్ష్మీనారాయణ సంఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుర్తుతెలియని సుమారు 25 ఏళ్ల యువకుడి హత్య జరిగినట్టు సమాచారం అందడంతో సంఘటన స్థలాన్ని పరిశీలించడం జరిగిందని, రక్తం మడుగులో పడిఉన్న మృతదేహం వద్ద క్లూస్ టీం తో కొన్ని ఆధారాలను సేకరించడం జరిగిందని, పూర్తి విచారణ అనంతరం మృతుని వివరాలు, హత్యకు గల కారణాలను వెల్లడించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని షాద్ నగర్ కమ్యూనిటీ అస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన వివరించారు. ఏసీపీ వెంట కేశంపేట్ సీఐ శ్రీనివాస్, నందిగామ ఎస్ఐ సుశీల, కొత్తూరు ఎస్ఐ సత్యశీల రెడ్డి, సిబ్బంది తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు