విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని నియోజకవర్గం బిఎస్బిసి మహిళా నాయకురాలు కళ్యాణి షుగర్ వ్యాధి అధికమై, వారి ఎడమ కాలు మోకాలి వరకు సేఫ్టీ కావడంతో, వారి కాలును పూర్తిగా తొలగించారు. సమాచారం అందుకున్న బీఎస్పీ నాయకులు వారి ఇంటి వద్దకు చేరుకొని మెడికల్ ఖర్చులు కింద 50వేల రూపాయలు అవసరము ఉన్నందున, శ్రీ సత్య సాయి జిల్లా తరఫున 5000 రూపాయలు, ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ షాకే వినయ్ కుమార్ ఎంఆర్పిఎస్ నాయకులు సాకే ఆంజనేయులు, కేశగాల వెంకటేష్ సహకారంతో పదివేల రూపాయలను ఆర్థిక సహాయం కింద అందించడం జరిగింది. జిల్లాలోని బీఎస్పీ నాయకులు కార్యకర్తలు దాతలు ఎవరైనా సరే కళ్యాణి కు తమ వంతుగా సహకారం అందజేయాలని జిల్లా బీఎస్పీ అధ్యక్షులు రాయుడు, సాకే వినయ్ కుమార్ తెలిపారు.
బి ఎస్ బి మహిళా నాయకురాలకు చేయూత
RELATED ARTICLES