చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సుధాకర్ రావు
విశాలాంధ్ర -ధర్మవరం : చిన్నపిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు చక్కటి శ్రద్ధలు కనపరచాలని చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సుధాకర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ఈ చలికాలంలో చిన్నపిల్లలకు దగ్గు, ఆయాసం, జలుబు, ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరడం జరుగుతోందని తెలిపారు. అంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల కూడా జరుగుతాయని తెలిపారు. ప్రస్తుత చలికాలంలో తుమ్ములు, దగ్గులు వచ్చినప్పుడు వైరస్ వస్తుందని తెలిపారు. ఇలాంటి సమయంలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. దగ్గు, జలుబు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కు లేదా టిష్యూ పేపర్ మూతి వద్దకు అడ్డం పెట్టుకొనే పద్ధతిని పాటించాలని తెలిపారు. దీంతోపాటు చేతులు కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని తెలిపారు. అంతేకాకుండా మనం తినే ఆహారంలో కూడా నియమ నిబంధనలు పాటించాలని, వేడిగా ఉండే పదార్థాలను మాత్రమే భుజించాలని, గోరువెచ్చటి నీరును తప్పకుండా తీసుకోవాలని తెలిపారు. ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ లోని తిను బండారాలను కానీ, కూల్ వాటర్ గాని తీసుకోరాదని తెలిపారు. తాజాగా ఉండే కాయగూరలు, పండ్లు భుజిస్తే చక్కటి ఆరోగ్యం అందరికీ లభిస్తుందని తెలిపారు. చిన్నపిల్లల పట్ల పెద్దలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటేనే ఆ పిల్లలకు పూర్తి ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు.
చిన్నపిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధను కనపరచాలి
RELATED ARTICLES