Saturday, April 19, 2025
Homeఆంధ్రప్రదేశ్భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డిపై కేసు న‌మోదు

భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డిపై కేసు న‌మోదు

టీటీడీ మాజీ ఛైర్మన్‌, వైసీపీ నేత‌ భూమన కరుణాకర్‌రెడ్డిపై తిరుప‌తి ఎస్వీయూ పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీడీ గోశాలపై అసత్య ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి ఎస్పీ హ‌ర్ష వ‌ర్ధ‌న్ రాజుకు ఫిర్యాదు చేశారు. ఎస్వీ గోశాల‌లో 100 ఆవులు మృతిచెందాయ‌ని… ప‌విత్ర‌మైన గోశాల‌ను గోవ‌ధ శాల‌గా మార్చారంటూ భూమ‌న త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేశార‌ని, ఆయ‌న‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ బోర్డు స‌భ్యుడు భానుప్ర‌కాశ్‌రెడ్డి మంగ‌ళ‌వారం నాడు చేసిన త‌న‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయ‌న ఫిర్యాదు మేర‌కు భూమ‌న‌పై బీఎన్ఎస్ యాక్ట్ 353(1), 299, 74 వంటి ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదైన‌ట్లు స‌మాచారం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు