విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని లక్ష్మీనగర్లో ఓ వ్యక్తిపై ఐదుగురు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన శుక్రవారం జరిగింది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు … గూడెషెడ్ కొట్టాలకు చెందిన గూడురు మారుతి తన చెల్లలు అరుణ లక్ష్మీనగర్లో నివాసముంటోంది. అయితే అరుణ కుమారుడు నందవర్ధన్ కొడుతుంటే గమనించినమారుతి మందలించాడు. దీంతో నందవర్ధన్ అక్కడి నుంచి వెళ్లి నలుగురు వ్యక్తులను పిలుచుకుని వచ్చి మారుతిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. మారుతి పిర్యాదు మేరకుకేసు ఐదుగురిపై కేసు నమోదు చేసినట్టు టూటౌన్ పోలీసులు తెలిపారు.
వ్యక్తిపై దాడి…ఐదుగురిపైకేసు నమోదు
RELATED ARTICLES