విశాలాంధ్ర నందిగామ :- అనుమతులు లేని సిగరెట్లు, మత్తు పదార్థాలు ఎవరైనా ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాకుండా అమ్మకాలు జరిపితే వారిపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయని ఎసిపి తిలక్ అన్నారు మంగళవారం పట్టణ స్టేషన్ హౌస్ ఆఫీసర్ నాయుడు సిబ్బందితో కలిసి నందిగామ,కంచికచర్ల పట్టణంలో సిగరెట్ దుకాణాల పై అకస్మిక దాడులు నిర్వహించారు పట్టణ పరిధిలోని శ్రీవిద్య స్కూల్ వద్ద షాపులో
దాడులు నిర్వహించి వివిధ రకాల ఫ్లైవర్స్ బ్రాండ్స్ కలిగిన విదేశీ సిగరెట్లు సీజ్ చేసి సదరు వ్యక్తి సేలం బ్రహ్మేశ్వర రావు పై కేసు నమోదు చేస్తున్నట్లు తెలియజేశారు వీటి ఖరీదు సుమారు లక్ష రూపాయల వరకు ఉంటుందని తెలిపారు, ముఖ్యంగా యువత ఈ విదేశీ సిగరేట్లకు బానిసలై వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారని, యువత చెడు వ్యసనాలకి బానిసవ్వొద్దని సత్ప్రవర్తనతో మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో ఉండాలని ఏసిపి తిలక్ సూచించారు.
విదేశీ సిగరెట్ల విక్రయదారుడు పై కేసు నమోదు…
- Advertisement -
RELATED ARTICLES


