Tuesday, May 6, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅసభ్యకరమైన ఫోటోలు తీయడంపై..కేసు నమోదు..

అసభ్యకరమైన ఫోటోలు తీయడంపై..కేసు నమోదు..

రూరల్ పోలీసులు.
విశాలాంధ్ర ధర్మవరం;! మండల పరిధిలోని గొట్లూరు గ్రామములో చెరువు కట్ట వద్ద గల ఇండ్ల వద్ద నాలుగు సంవత్సరాల వయసు కల ఓ బాలికపై అసభ్యకరమైన ఫోటోలను గుట్ట కింద పల్లి కు చెందిన నరసింహులు తీయడం జరిగింది. చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు బాలిక తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించారు. దీంతో తల్లి వరలక్ష్మి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, రూరల్ పోలీసులు పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం నరసింహులు పరారీలో ఉన్నాడు. త్వరలోనే నర్సిమ్ములను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు