Thursday, April 10, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిడూప్లికేట్ పట్టాలు చేయించుకుని నిర్మాణాలు చేపడుతున్న వారిపై కేసులు నమోదు చెయ్యాలి

డూప్లికేట్ పట్టాలు చేయించుకుని నిర్మాణాలు చేపడుతున్న వారిపై కేసులు నమోదు చెయ్యాలి

సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు
విశాలాంధ్ర ధర్మవరం; సర్వేనెంబర్ 650-2 లో డూప్లికేట్ పట్టాలు చేయించుకొని నిర్మాణాలు చేపడుతున్న ఆక్రమణదారులపై 420 కేసులు వెంటనే నమోదు చేయాలని, ప్లంబర్ కార్మికులకు పట్టాలు ఇవ్వాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలో తాసిల్దార్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేసి ఎమ్మార్వో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మధు మాట్లాడుతూ సర్వేనెంబర్ 650-2 ప్లంబర్స్ కార్మికులు న్యాయం చేయాలి అని, ఎవరైతే అనర్హులు దొంగ పట్టాలు చేయించు కున్నారో వారి పట్టాలు తొలగించి, అర్హులైన ప్లంబర్ కార్మికుల కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అలా చేయని పక్షంలో ఈనెల 24 వ తేది న భూ ఆక్రమణ జరిగిన స్థలం లో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్,సహాయ కార్యదర్శి ఎర్రంశెట్టి రమణ, చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పోలా లక్ష్మీనారాయణ,ప్లంబర్ అసోసియేషన్ నాయకులు అధ్యక్షులు, రాజు, కార్యదర్శి లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆంజనేయులు, తాజ్, చిన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు