Friday, February 21, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅవతార్ మెహర్ బాబా 131వ అవతరణ మహోత్సవ వేడుకలు..

అవతార్ మెహర్ బాబా 131వ అవతరణ మహోత్సవ వేడుకలు..

అవతార్ మెహర్ బాబా సేవకులు
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని పోతుకుంట రోడ్డు, పెనుజూరు కాలనీలో(గిర్రాజు కాలనీ) అన్నపూర్ణేశ్వరి ఆలయం ఎదురుగా గల అవతార్ మెహర్ బాబా సెంటర్లో అవతార్ మెహర్ బాబా 131 వ అవతరణ (జన్మదిన) మహోత్సవ వేడుకలను ఈనెల 25వ తేదీన నిర్వహిస్తున్నట్లు మెహర్ బాబా సెంటర్ కార్యదర్శి పెనుజూరు రమేష్ సుజాత, నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన తోటి వారిని ప్రేమించడమే భగవంతుని ప్రేమించడానికి అత్యంత ఆచరణ సాధ్యమైన విధానమని, మానవసేవే మాధవసేవ అన్న స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అమలు పరచాలని తెలిపారు. ఇతరుల లోపాలను చూడడానికి బదులు, మనకు మనం ఆత్మవలోకనం చేసుకోగలిగినట్లయితే మనము భగవంతుని ప్రేమించినట్లు అవుతుందని తెలిపారు. అవతారుడి అవతరణను సృష్టికి తెలియజేయడమే సేవకుల లక్ష్యము అని తెలిపారు. మెహర్ బాబా జన్మదిన వేడుకల సందర్భంగా ప్రేమిక సహవాసును ఈ నెల 25వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 4;45 నిమిషాల నుండి మధ్యాహ్నం 1:30 వరకు వివిధ సేవా కార్యక్రమాలు, ప్రేమిక ఉపన్యాసాలు, పాటలు ఉంటాయని తెలిపారు. సప్తవర్ణ పతాకమును ఆవిష్కరించుట, వాటి ప్రాముఖ్యతను తెలియజేయుట, మ్యూజికల్ చైర్స్, హాస్టల్ విద్యార్థులకు బుక్స్ పెన్నులు, బాబా ఫోటో, స్వీటు పంపిణీ చేయుట, స్లిప్స్ కార్యక్రమం, మెహర్ బాబా అవతారుడి అవతరణ విశిష్టత, ముఖ్యములచే సత్య ప్రేమ సందేశములు వినిపించుట, మెహర్ బాబా సంకీర్తన, ప్రవచనాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఇదే రోజు రక్తదాన శిబిరము కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి ఆదివారము మెహర్ బాబా సెంటర్ యందు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వృద్ధులకు, వికలాంగులకు, ఉచిత వైద్య చికిత్సలతో పాటు మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయబడే కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కావున మెహర్ బాబా జయంతి వేడుకlo అధిక సంఖ్యలో మెహర్ బాబా ప్రేమికులు పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు