Thursday, April 3, 2025
Homeఆంధ్రప్రదేశ్లోక్‌సభలో వక్ఫ్‌ సవరణ బిల్లుని ప్రవేశపెట్టిన కేంద్రం

లోక్‌సభలో వక్ఫ్‌ సవరణ బిల్లుని ప్రవేశపెట్టిన కేంద్రం

ప్రతిపక్షాల నిరసనల మధ్య కేంద్రం వక్ఫ్‌ సవరణ బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. 1995నాటి వక్ఫ్‌ చట్టంలో సుమారు 40 సవరణలతో ప్రభుత్వం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అనంతరం ఈ బిల్లుపై చర్చ చేపట్టనున్నారు. సుమారు 8 గంటలపాటు చర్చ జరపనున్నారు. అయితే ఈ బిల్లుపై 12 గంటల పాటు సుదీర్ఘమైన, విస్తృతమైన చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు పట్టుబట్టిన సంగతి తెలిసిందే. చర్చ అనంతరం ఓటింగ్‌ జరగనుంది.ఈ బిల్లును గతేడాది ఆగస్టులో కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అయితే దీనిపై ప్రతిపక్షాల నుండి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి)కి పంపింది. ఈ కమిటీ పలు ప్రతిపాదనలతో ఇటీవల బిల్లుకు ఆమోదం తెలిపింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు