Sunday, April 20, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅన్ని వర్గాల ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు లక్ష్యం..

అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు లక్ష్యం..

పురుషోత్తం రాయల్,విద్యార్ధి విభాగం అధ్యక్షులు పురుషోత్తం రాయల్
విశాలాంధ్ర ధర్మవరం : అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు యొక్క లక్ష్యము అని విద్యార్థి విభాగం అధ్యక్షులు పురుషోత్తం రాయల్ తెలిపారు. ఈ సందర్భంగా
వారు మాట్లాడుతూ నిరుద్యోగులను,ఉద్యోగులనే కాదు అన్నివర్గాల ప్రజలనూ మోసం చేయడమే అలవాటుగా మార్చుకున్న చంద్రబాబు అని,గ్రూప్‌-2 అభ్యర్థులనుకూడా నిలువునా మోసం చేశారు అని మండిపడ్డారు. మూడు వారాలుగా గ్రూప్‌-2 అభ్యర్థుల అభ్యంతరాలను వింటున్నట్టు నటించాడు,న్యాయం చేస్తున్నట్టు నటించి చివరకు వారిని నట్టేటా ముంచారు అని తెలిపారు.లోకేష్‌దేమో ఒక మాట,చంద్రబాబునాయుడదేమో ఒకమాట ఒకవైపు వాయిదా వేయిస్తున్నామంటూ చెప్పి మరోవైపు తమ చేతుల్లో లేదని చెప్పడం ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనం అని మండిపడ్డారు.నిన్నఅభ్యర్ధుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటున్నట్టు విద్యాశాఖమంత్రి ట్వీట్ చేశారు కానీ జరిగింది మరొకటిని తెలిపారు.మరోవైపు తాము వాయిదా వేయమనే చెప్పామంటూ ముఖ్యమంత్రి పేరుతో సర్క్యూలేట్ అవుతున్న ఆడియో రాష్ట్ర ప్రజలంతా విన్నారు అని తెలిపారు..ఇంకోవైపు గ్రూప్ 2 పరీక్ష వాయిదా అంటూ వార్తలు వేసిన ఛానెళ్లు మీద కేసులు ఎంతవరకు సమంజసమని తెలిపారు.ఇంత అయోమయం, గందరగోళం ఉన్న ప్రభుత్వాన్ని నేనెప్పుడూ చూడలేదు అని దుయ్యబట్టారు.
చివరిదాకా వాయిదా వేస్తున్నామని నమ్మించి ఈ ప్రభుత్వం గ్రూప్ 2 అభ్యర్ధులను మోసం చేసింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తక్షణమే అత్యవసరంగా సమావేశమై గ్రూపు 2 అభ్యర్ధులకు స్పష్టతనివ్వాలి అని డిమాండ్ చేశారు.
ఇంతటి గందరగోళం మధ్య పరీక్ష నిర్వహణ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు అని, ఇప్పుడు జరిగిన దానిని రద్దుచేసి మరల స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
ఆందోళన చేస్తున్న అభ్యర్ధులపైన పోలీసుల లాఠీఛార్జీని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం అని తెలిపారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న అభ్యర్ధులను బేషరతుగా వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు.
ఆందోళన చేస్తున్నవారిపై పోలీసులతో లాఠీఛార్జి చేయించి, అమనుషంగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ప్రజలను ఎలా మోసం చేస్తారో చెప్పడానికి ఇది మరొక ఉదాహరణ మాత్రమే నని, చివరకు అయోమయం, గందరగోళం, అస్పష్టత మధ్యే పరీక్షలు పెట్టడం అత్యంత దారుణం అని తెలిపారు.గత ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి మెగా డీఎస్సీ పేరుతో ఇప్పటికీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా కాలయాపన చేసి మోసం చేసింది అని తెలిపారు.ప్రతి జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ చెప్పి, అసలు దాని గురించి పట్టించు కోలేకపోవడం ఏ మనాలని వారు ప్రశ్నించారు.
వాలంటీర్లకు పదివేలు ఇస్తానని చెప్పి,లక్షలమంది ఉద్యోగాలను తొలగించడం న్యాయమా అని ప్రశ్నించారు.గ్రామ,వార్డు సచివాలయాల్లో సిబ్బంది కుదింపు పేరిట వైయస్సార్‌సీపీ హయాంలో కల్పించిన శాశ్వత ఉద్యోగాలకు శాశ్వతంగా కోతపెట్టారు అని తెలిపారు.ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌లో 18 వేలమందిని,ఫీల్డ్‌ అసిస్టెంట్లనూ,ఫైబర్‌ నెట్‌ కార్పొరేషన్‌లోనూ, ఏపీ ఎండీసీలోనూ,వైద్య ఆరోగ్య శాఖలోనూ పనిచేస్తన్నవారిని తొలగించారు అని తెలిపా రు.ఈ కార్యక్రమంలో వైయస్ఆర్యు పట్టణ ఉపాధ్యక్షులు అల్లాడి ప్రవీణ్,రెడ్డి శ్రీ హరి వైయస్ఆర్.సీ.పీ యువజన విభాగం నాయకులు రామాంజి,జి నాగార్జున,జి అంజన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు