సిపిఐ పట్టణ కార్యదర్శి రవికుమార్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని రంగా థియేటర్ పక్కన కింద ఉన్న ట్రాన్స్ఫార్మర్ వల్ల పలు ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే ఆ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను మార్చాలని సిపిఐ పట్టణ కార్యదర్శి రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు సిపిఐ నాయకులతో విద్యుత్ ఏడి నరసింహారెడ్డికు, డి-1 ఏ ఈ నాగభూషణం కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ,పాద చారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని, ఇటీవలే ఒక మహిళకు విద్యుత్ షా కొట్టి ఒక చెయ్యి పూర్తిగా కాలిపోయిందని తెలిపారు. ఈ ట్రాన్స్ ఫార్మర్ వల్ల చుట్టుపక్కల కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని, రోడ్డుకి ఆనుకొని ఉండడంతో , పాఠశాల,కళాశాలకు, వెళ్లే విద్యార్థులు, నడుచుకుంటూ వెళ్లే వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని తెలిపారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు ఆ మహిళకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని అదేవిధంగా ఇప్పటికైనా( డిపి )ట్రాన్స్ ఫార్మర్ ను అక్కడ నుండి వెంటనే తొలగించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి రవికుమార్, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి రమణ, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి, వెంకటనారాయణ, చెనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పోల లక్ష్మీనారాయణ,చేనేత కార్మిక జిల్లా గౌరవాధ్యక్షులు వెంకటస్వామి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు రాజా, పట్టణ నాయకులు బాల రంగయ్య, సురేష్,ఆదినారాయణ,శ్రీనివాసులు,కేశవ,వీరనారప్ప తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను మార్చి ప్రమాదాలను అరికట్టండి..
RELATED ARTICLES