Homeఅంతర్జాతీయంహెచ్-1బీ వీసాలో మార్పులు

హెచ్-1బీ వీసాలో మార్పులు

- Advertisement -


వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహంకార, ఆధిపత్య ధోరణి ఇంకా తగ్గడంలేదు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈనేపథ్యంలో హెచ్-1బీ వీసాలకు సంబంధించి అమెరికా కాంగ్రెస్ ముందుకు ఓ కీలక ముసాయిదా బిల్లు వచ్చింది. గ్రీన్ కార్డు పొందేందుకు హెచ1బీ వీసాను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ…దీనికి స్వస్తి పలకాలని కోరుతూ ఓ రిపబ్లికన్ నేత బిల్లును ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ సభ్యుడు చిప్‌రాయ్ ‘అమెరికన్ వైట్-కాలర్ వర్కర్ జాబ్స’ పేరుతో ఈ ముసాయిదా బిల్లును తీసుకొచ్చారు. విదేశీ విద్యార్థులు పట్టభద్రులైన తర్వాత పరిమిత కాలం పాటు అమెరికాలో పనిచేసేందుకు అనుమతించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని కూడా రద్దు చేయాలని ఇందులో కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…దాదాపు నలభై ఏళ్ల చరిత్రలో హెచ1బీ వీసా దుర్వినియోగం అయ్యిందన్నారు. దీని కారణంగా చౌకైన విదేశీ కార్మికుల కోసం అమెరికన్ రంగాలకు చెందినవారిని పక్కనపెడుతున్నారని ఆరోపించారు. దాని స్థానంలో ప్రతిభకు, వాస్తవ వేతన ప్రమాణాలను అమలుచేస్తూ…అమెరికన్ వైట్ కాలర్ ఉద్యోగులకు ప్రాధాన్యమిచ్చే వ్యవస్థను తీసుకురావాలని పిలుపునిచ్చారు.
భారతీయులు మా టార్గెట్ కాదు…
హెచ1బీ వీసాల నిబంధనలు కఠినతరం చేయడంపై భారతీయుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అమెరికా క్లారిటీ ఇచ్చింది. తమ దేశ వీసా చట్టాలు ప్రత్యేకంగా భారత్‌ను లక్ష్యంగా చేసుకునే రూపొందించినవి కావని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి టామీ పిగోట్ పేర్కొన్నారు. అన్ని దేశాలకూ అవే నిబంధనలు వర్తిస్తాయని స్పష్టంచేశారు. ‘గత ప్రభుత్వాలు వీసా చట్టాన్ని సరిగా అమలుచేయలేదు. ఇప్ప్పుడు ఆ పరిస్థితి లేదు. భారత్‌ను లక్ష్యంగా చేసుకునే వీసా చట్టాలు ఏవీ లేవు’ అని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు