విశాలాంధ్ర -అనంతపురం : తమిళ నాడు లోని కోయంబత్తూర్ లో పీ టీ జోన్ క్లాసిక్ ఆధ్వర్యం లో జరిగిన మిస్టర్ సౌత్ ఇండియా బాడీ బిల్డింగ్ పోటీ లలో అనంత కుర్రాడు ఛారుగుండ్ల శివ తేజా మరోసారి సత్తా చాటాడు. కేరళ, తమిళనాడు, కర్నాటక ,ఆంధ్ర ప్రదేశ్ , గోవా రాష్ట్రాల నుండి వచ్చిన బాడీ బిల్డర్ లతో గట్టి పోటీ ఇచ్చినప్పటికి శివ తేజా మిస్టర్ సౌత్ ఇండియా బాడీ బిల్డింగ్ 80 కేజి ల విభాగం లో 5 స్థానం దక్కించు కొని అనంత పురము జిల్లా కే వన్నె తెచ్చినాడు. శివ తేజ కఠోర శ్రమ దీక్షతో రోజు రోజుకు పోటీలకు అనుగుణంగా తన్ను తాను మార్చుకుంటూ అనంతపురము నుంచి ఆంధ్ర రాష్ట్రము తరుపున జాతీయ స్థాయి లో ఉత్తమ ఫలితం సాధించడమే తన లక్ష్యమని బాడీ బిల్డర్ శివ తేజ తెలియజేశారు. ఈ సందర్భంగా వైద్య శాఖ, సిబ్బంది అనంతపురము వాసులు మరియు తల్లి తండ్రులు నాగేంద్ర ప్రసాద్ , అరుణ అభినందనలు తెలిపారు.