Friday, April 18, 2025
Homeజిల్లాలుఅనంతపురంసిలిండర్లు మార్చినప్పుడల్లా రబ్బర్ ట్యూబును పరీక్షించండి

సిలిండర్లు మార్చినప్పుడల్లా రబ్బర్ ట్యూబును పరీక్షించండి

జిల్లా అగ్నిమాపక సహాయ అధికారి కె.పీ. లింగమయ్య

విశాలాంధ్ర -అనంతపురం : సిలిండర్లు మార్చినప్పుడల్లా రబ్బర్ ట్యూబును పరీక్షించాలని జిల్లా అగ్నిమాపక సహాయ అధికారి కె.పీ. లింగమయ్య పేర్కొన్నారు. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా బుధవారం స్థానిక రామ్ నగర్ లో సిరి హైట్స్ అపార్ట్మెంట్ నందు అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్యాస్ లీక్ అయిన ఎడల ఎటువంటి అగ్ని నివారణ చర్యలు తీసుకోవాలో వివరంగా డెమో ద్వారా తెలియజేశారు. వంట చేయునపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేశారు. అపార్ట్మెంట్లో నివసిస్తున్న సభ్యులు అగ్నిమాపక నివారణ పై అవగాహన కల్పించినందుకు అగ్నిమాపక శాఖ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది. ఎల్ ఎఫ్ లు బ. వెంకటేసులు , ఎస్. రమేష్ కుమార్ రెడ్డి, ఎఫ్ ఎం లు వై. ఓబీ రెడ్డి, బ. అంకిరెడ్డి, ఏ. వంశీకృష్ణ , ఏం. రమేష్ , జి. శివన్న , హర్ష వర్గస్ రెడ్డి హెచ్ జి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు