Thursday, January 2, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిశ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయ కమిటీ చైర్మన్గా చెన్నం శెట్టి జగదీష్ ప్రసాద్ ఎంపిక…

శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయ కమిటీ చైర్మన్గా చెన్నం శెట్టి జగదీష్ ప్రసాద్ ఎంపిక…

ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు

శుభాకాంక్షలు తెలియజేసిన ఆలయ ఈవో వెంకటేశులు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం కమిటీకి అడ్ హక్ కమిటీ చైర్మన్గా చెన్నం శెట్టి జగదీష్ ప్రసాద్ ను ఎంపిక చేసినట్లు ఆలయ ఈవో వెంకటేశులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలోని అర్చకులు కొనేరాచార్యులు, మకరంద బాబు, భాను ప్రకాష్ చెన్నం శెట్టి జగదీష్ ప్రసాద్ దంపతులకు ఆలయ ఈవో ఆధ్వర్యంలో స్వాగతం పలికి, వారి పేరిటన ప్రత్యేక అర్చనలు పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను వైభవంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రతి వ్యక్తి దైవభక్తి కలిగి ఉండాలని, దైవత్వంతోనే కుటుంబంలో సుఖశాంతులు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు