విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని నేసే పేటలో వెలిసిన శ్రీ అంబా భవాని దేవాలయము నందు సకుల సాలె, మరాఠీ సంఘం ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ 398వ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. తదుపరి ఆలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ శివాజీ చరిత్రను తెలిపారు. పట్టణంలోని పురవీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. మండల పరిధిలోని గోట్లురు గ్రామంలో గల శివాజీ విగ్రహానికి పాలాభిషేకంతో పాటు పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. తదుపరి అక్కడ గల అనాధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం బిజెపి నియోజకవర్గ , ఎన్డీఏ కార్యాలయ మంత్రి హరీష్ బాబు, బిజెపి పట్టణ అధ్యక్షులు జింక చంద్రశేఖర్, రూరల్ అధ్యక్షులు జి. చంద్ర, స్వకుల సాలే సంఘము నాయకులు సరోడే కృష్ణమూర్తి, జూజారు నాగరాజు, కామ్లే లక్ష్మణరావు ,సరోదే భుజంగరావు, సునీల్, ఈశ్వర్, మరాఠీ సంఘం నాయకులు ఎం. జె. హరి, ప్రకాష్ రావు, పెద్ద వెంకటేష్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ 398వ జయంతి వేడుకలు
RELATED ARTICLES