విశాలాంధ్ర -తనకల్లు : మండల పరిధిలోని కోటపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ నాయక్ అనారోగ్యం బారిన పడి ముఖ్యమంత్రి సహాయ నిధికి సహాయం కోరగా అతనికి 25584 రూపాయలు మంజూరు అయింది. ఆ చెక్కును మండల తెలుగు యువత అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ కదిరి పట్టణ మైనార్టీ నాయకులు బాబుల్లా లు అందజేశారు. తన ఆరోగ్యం కోసం సహాయం అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తో పాటు స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కు లక్ష్మీనారాయణ నాయక్ కృతజ్ఞతలు తెలియజేశారు