హెడ్మాస్టర్ తిమ్మారెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ ప్రతాపరెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; జాతీయ పోటీలకు మండల పరిధిలోని చిటిచెర్ల ప్రభుత్వ పాఠశాల పదవ తరగతి చదువుతున్న యశస్విని అనే విద్యార్థిని ఎంపిక కావడం జరిగిందని హెడ్మాస్టర్ తిమ్మారెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల మూడవ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి సీనియర్ జూడో పోటీలలో మా పాఠశాల విద్యార్థి 52 కేజీల విభాగంలో అత్యంత ప్రతిభ కనబరిచి,జాతీయస్థాయిలో ఆరవ స్థానం సాధించి, కేవలం 15 సంవత్సరాల అతి చిన్న వయసులోనే రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతీయ పోటీలకు అర్హత సాధించడం నిజంగా గర్వించదగ్గ విషయమని వారు తెలిపారు. అదేవిధంగా జనవరి 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉత్తరాఖండ్లో జరిగే జాతీయ క్రీడలకు జూడో ఆటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఎంపిక కావడం జరిగిందని వారు తెలిపారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు, హెడ్మాస్టర్, ఫిజికల్ డైరెక్టర్, పాఠశాల విద్యార్థులు, పాఠశాల కమిటీ, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు జాతీయ స్థాయికి ఎంపికైన యశస్విని ను అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
జాతీయ పోటీలకు చిగీచర్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ఎంపిక..
RELATED ARTICLES