Wednesday, February 5, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅంతర్జాతీయ జూడో ఎంపిక పోటీలకు చిగిచెర్ల విద్యార్థి

అంతర్జాతీయ జూడో ఎంపిక పోటీలకు చిగిచెర్ల విద్యార్థి

విశాలాంధ్ర ధర్మవరం:: అంతర్జాతీయ జూడో ఎంపిక పోటీలకు ధర్మవరం మండల పరిధిలోని చిగిచెర్ల గ్రామం లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థి అఫ్జల్ మహారాజ్ కైవసం చేసుకోవడం జరిగిందని హెడ్మాస్టర్ తిమ్మారెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రతాపరెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ
ఇటీవల జరిగిన స్కూల్ గేమ్స్ జూడో పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి బ్రంజ్ మెడల్ సాధించిన అఫ్జల్ మెహరాజ్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది అని తెలిపారు. అంతర్జాతీయ ఎంపిక పోటీలకు పిలుపు వచ్చింది అని,భోపాల్ లోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ లో జనవరి 25 నుంచి జనవరి 30 వరకు జరిగే అంతర్జాతీయ ఎంపిక పోటీలకు ఎంపిక చేయడం జరిగిందన్నారు.ఇక్కడ ఎంపిక అయితే( ఎన్సీఐఓ) నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భోపాల్లో సీటు లభిస్తుంది అని, అంతర్జాతీయ పోటీలలో పాల్గొనే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం జరుగుతుందన్నారు.చిగిచెర్ల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న అఫ్జల్ మెహరాజ్ జూడోలో గత నాలుగు సంవత్సరాలుగా మంచి ప్రతిభ కనపరచడం ద్వారా ఈ అంతర్జాతీయ ఎంపిక పోటీలకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపిక కావడం జరిగింది అని తెలిపారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థి అఫ్జల్ మహారాజ్ ను ఫిజికల్ డైరెక్టర్ ప్రతాపరెడ్డి, హెడ్ మాస్టర్ తిమ్మారెడ్డి , పాఠశాల కమిటీ, గ్రామ ప్రజలు, తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు