గ్రామ, పట్టణాలలో ప్రతి మహిళ పోలీస్ పిల్లలకు చట్టాలను క్షుణ్ణంగా అవగాహన కల్పించాలి
సిడిపిఓలు కవిత, లక్ష్మి
విశాలాంధ్ర ధర్మవరం:: పిల్లలకు గుడ్ టచ్ బాటచ్ కాదు అని నో టచ్ ను నేర్పాలని, గ్రామ, పట్టణాలలో ప్రతి మహిళా పోలీస్ పిల్లలకు చట్టాలపై అవగాహన కల్పించాలని సిడిపిఓలు లక్ష్మి, కవిత తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ, వార్డ్ సచివాలయంలో పిల్లలు మహిళలు ప్రశాంతంగా ఉండటానికి గ్రామాలలో పని చేయడానికి ప్రతి మహిళా పోలీస్ పిల్లల కొరకు ఉన్న చట్టాలను క్షుణ్ణంగా తెలుసుకోవలసిన అవసరం ఉందని తెలిపారు. నేడు మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ సమితి, చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పిల్లలు శారీరక,మానసిక ఉద్రేకం కలిగించే అంశాలు,బాలల న్యాయ చట్టం,బాల్య వివాహాలు నిలుపుదల గురించి వివరించడం జరిగిందన్నారు. ధర్మవరం ఆర్డీఓ ఆఫీసు సమావేశ మందిరంలో డివిసనల్ స్థాయి మహిళా పోలీసులు పంచాయతీ కార్యదర్శులకు ఒకరోజు కార్యశాలలో శిక్షణ తరగతులను నిర్మించడం జరిగిందన్నారు . పిల్లలను ప్రభావితం చేసే అంశాలు మన చుట్టూ చాలా ఉన్నాయి అని, వాటి గురించి మహిళా పోలీసులు పూర్తిగా తెలుసుకుని పిల్లలను వాటి నుండి రక్షించవలసిన అవసరం ఉందని సూచించారు. ముఖ్యంగా బాలికలు లైంగిక వేధింపులకు గురి కాకుండా చుసుకోవలసిన బాధ్యతను హాజరైన వారికి గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్కూల్స్ విజిట్ చేసి ఎవరైతే దుర్భాలమైన పరిస్థితులలో ఉన్న పిల్లలు,ఒంటరి తల్లిదండ్రులు ఉన్న పిల్లలు,ఇబ్బందులకు గురి కాబడే పిల్లలు ఉంటారో వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఆ పిల్లలను టార్గెట్ చేసుకుని బాల్య వివాహాలు చేయడం,ట్రాప్ చేయడం వంటివి జరగకుండా చూసుకోవాలి అని తెలియచేశారు. బాల్య వివాహాలు నిలుపుదలలో ఎవరిని ఉపేక్షించేది లేదని వారి పట్ల చట్ట పరంగా చర్యలు తీసుకోబడుతుందని తెలిపారు. అలాగే బాల్య వివాహాలు నిలుపుదలలో పంచాయతీ స్థాయిలో ఉన్న అధికారులు కలిసి మెలసి పని చేయాలని, అలా పాల్గొనే వారికి కూడా ప్రభుత్వం అండదండలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిపిఓ మహేష్, చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ కొండప్ప, ప్రొటెక్షన్ ఆఫీసర్స్ నాగలక్ష్మి, మురళిదర్,సోసియల్ వర్కర్ ఆనంద్,వనజాక్షి, పవన్ పాల్గొన్నారు.
పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కాదు- నో టచ్ నేర్పాలి
RELATED ARTICLES