Thursday, April 3, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఎన్టీఆర్ సర్కిల్లో చలివేంద్రం ఏర్పాటు

ఎన్టీఆర్ సర్కిల్లో చలివేంద్రం ఏర్పాటు

విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలోని కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న ఎన్టీఆర్ సర్కిల్లో సోమవారం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు వాసవి క్లబ్ ప్రెసిడెంట్ కాసం సెట్టి శ్యాంప్రసాద్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం కూరగాయల మార్కెట్ కు ఎంతోమంది ప్రజలు వస్తూ ఉంటారు. ప్రస్తుతం వేసవికాలం కావడంతో కూరగాయల మార్కెట్ కు విచ్చేసే ప్రజల దాహార్తి తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేశామన్నారు. చలివేంద్రం ఏర్పాటుకు
దాతలు లక్ష్మీకంబగిరిజువెలర్స్
(జైని లక్ష్మీనారాయణ) షాపు రంగయ్య అంగడి పుట్లూరు రోడ్డు (జయవరం సుబ్బరంగయ్య)ల సహకారంతో చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సెక్రెటరీ కొప్పరపు కుమార్ ట్రెజరర్ జైని శేష ఫణి, ఐఇసి ఆఫీసర్ భూమా సూర్యనారాయణ, బైసాని వెంకట శేషఫణి వి209ఏ గవర్నర్ కందూరు సుబ్బరామయ్య, క్యాబినెట్ సెక్రటరీ బండారు శివకుమార్, రీజన్ చైర్ పర్సన్ టంగుటూరి చంద్రశేఖర్, జొన్ చైర్ పర్సన్ అచ్యుత నాగేంద్ర గుప్త, క్లబ్ డైరెక్టర్స్ సంతోష్, ఆరవేటి సుబ్బారావు, శంకరయ్య, నాగభూషణం, శివశంకర్, నాగార్జున, శేషు, బివిఎస్ కృష్ణ, సతీష్, సుబ్బరత్నమయ్య, సుధాకర్, కుల్లూరు శివకుమార్, గణేష్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు