Thursday, April 3, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిచలివేంద్రాలు ప్రజల దాహార్తిని తీరుస్తాయి

చలివేంద్రాలు ప్రజల దాహార్తిని తీరుస్తాయి

సమాచార హక్కు ప్రజా సంరక్షణ వేదిక
విశాలాంధ్ర ధర్మవరం;; చలివేంద్రాలు ప్రజల యొక్క దాహార్తిని తీర్చేందుకు ఎంతో దోహదపడుతున్నాయని సమాచార హక్కు ప్రజా సంరక్షణ వేదిక జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు గోపి ,జిల్లా కార్యదర్శి నూర్ మహమ్మద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి టాకీస్ రోడ్డు కురువ వీధిలో చలివేంద్రంను వారు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం పట్టణంలో ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున ఈ చలివేంద్రం ఏర్పాటు ఎంతో సంతోషించదగ్గ విషయం అని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి అనేక పనుల మీద పట్టణానికి వచ్చినప్పుడు ఈ చరివేంద్రాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. సమాచార హక్కు ప్రజా సంరక్షణ వేదిక ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు చెన్న ఆదినారాయణ ,పట్టణ అధ్యక్షులు సోలిగాళ్ళ బుజ్జి కొండప్ప, ఉపాధ్యక్షులు షామీర్ భాష ,సభ్యులు మంజునాథ్,మున్వర్ భాష ,నసీన్, చింతా నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు