Friday, April 4, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపదవ తరగతి యు టి ఎఫ్ మోడల్ పేపర్స్ విద్యార్థులకు మంచి ఉపయోగాన్ని కలిగించాయి

పదవ తరగతి యు టి ఎఫ్ మోడల్ పేపర్స్ విద్యార్థులకు మంచి ఉపయోగాన్ని కలిగించాయి

సెట్టిపి జయ చంద్రారెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం : మార్చి నెలలో రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులకు యుటిఎఫ్ తయారుచేసిన మోడల్ టెస్ట్ పేపర్లు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడి, ఉత్తీర్ణత తో పాటు అధిక మార్కులు వచ్చే అవకాశం రావడం పట్ల యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షులుతెలిపారుసెట్టిపి జయచంద్ర రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యారంగ వికాసంలో యుటిఎఫ్ ప్రముఖ పాత్ర వహించిందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. పదవ తరగతి పరీక్షల్లో యుటిఎఫ్ తయారుచేసిన మోడల్ టెస్ట్ పేపర్లో అన్ని విషయాలలో 70 మార్కులకు పైగా రావడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఇందులో భాగంగా తెలుగులో 74 మార్కులు, హిందీలో 85 మార్కులు, ఆంగ్లంలో 43 మార్కులు, గణితములో 85 మార్కులు, ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజీ సైన్స్ లో 76 మార్కులు, సాంఘిక శాస్త్రంలో 74 మార్కులు రావడం జరిగిందని తెలిపారు. విద్యారంగ వికాసములో యుటిఎఫ్ గత కొన్ని సంవత్సరాలుగా పదవ తరగతి విద్యార్థులకు మోడల్ టెస్ట్ పేపర్లను నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఉపాధ్యాయ ఉద్యమంలో కూడా అగ్రగామి సంఘముగా ఉంటూ విద్యార్థుల వికాసం కోసం కృషి చేస్తున్న సంఘం యుటిఎఫ్ అని తెలిపారు. పదవ తరగతి పుస్తకాలను చదువుతూనే పరీక్షలు దగ్గరగా వచ్చేటప్పటికి విద్యార్థులకు కరదీపికగా భరోసాను ఇచ్చే విధంగా తాము మోడల్ టెస్ట్ పేపర్లను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ మోడల్ టెస్ట్ పేపర్లను సీనియర్లు తయారు చేయడం జరిగిందని, ఇంతటి మార్కులు రావడానికి కృషిచేసిన ఉపాధ్యాయ బృందానికి పేరుపేరునా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విద్యా సంవత్సరంలో 1,59,000 ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు, 25,000 మంది తెలుగు మీడియం విద్యార్థులకు మా మోడల్ టెస్ట్ పేపర్లను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ మోడల్ టెస్ట్ పేపర్లు ఇంత ఆదరణ పొందడానికి తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు ప్రధాన భూమిక పోషించడం జరిగిందని వారు తెలిపారు. యుటిఎఫ్ చేపట్టిన ఏ పని అయినా సరే చిత్తశుద్ధితో అందరికీ ఉపయోగపడే తీరులో ఉంటుందని వారు స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు