క్రీడల ద్వారానే మానసిక ఆరోగ్యం… ప్రిన్సిపాల్ సురేష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం:;భారత ప్రభుత్వం,యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ,నెహ్రూ యువ కేంద్రం అనుబంధ సంస్థ అయిన సోషల్ సోల్జర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్మవరం ఆర్ డి టి గ్రౌండ్ నందు యువత కు క్రీడా పోటీలను నిర్వహించడం జరిగింది అని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు గారు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రపతి అవార్డు గ్రహీత కే. జయ మారుతి , యువ నాయకులు ముక్తం మనిదీప్, పి.ఈ.టీ
రాజేష్ , లెక్చరర్ హరి బాబూ కొచ్ జి. పృథ్వి రాజ్ , సి.వీరప్ప హాజరై పలు విషయాలను తెలియజేయడం జరిగిందని తెలిపారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ యువత మానసిక, శారీరక ఆరోగ్యం గా ఉండాలి అంటే క్రీడల ద్వారానే సాధ్యం అని పేర్కొన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తినీ కలిగి ఉండాలి అని తెలిపారు. అలాగే ప్రపంచం లో అత్యధిక జనాభా కలిగిన దేశం అయినప్పటికి క్రీడలలో మాత్రం చాల వెనుక బడి ఉంది అని , కావున ప్రతి ఒక్కరూ క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గెలుపొందిన యువతకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ట్రోపీ, మెడల్స్ , ప్రశంసా పత్రాలు అందించారు.