సీఎంతో పాటు పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో సైకిల్ సవారీ చేశారు. నగరంలోని ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ) గ్రౌండ్స్ నుంచి నోవాటెల్ హోటల్ వరకు జరిగిన ఈ ర్యాలీలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం 5.5 కిలోమీటర్ల దూరాన్ని 21 నిమిషాల 18 సెకండ్లలో పూర్తి చేశారు. ఈ సైకిల్ యాత్ర ఏయూ గ్రౌండ్స్‌లో ప్రారంభమై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్, పోలమాంబ గుడి, వాల్తేరు, బీచ్ రోడ్ మీదుగా నోవాటెల్ హోటల్ వద్ద ముగిసింది. ర్యాలీ సమయంలో ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ, చంద్రబాబు ఏమాత్రం అలసట లేకుండా సైకిల్ తొక్కుతూ ముందుకు సాగారు. దారిపొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వెంట జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని సైకిల్ తొక్కారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీని నిర్వహించారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖ రోడ్లపై సీఎం చంద్రబాబు సైకిల్ సవారీ
- Advertisement -
RELATED ARTICLES


