కరెస్పాండెంట్ భాస్కర్ రెడ్డి
విశాలాంధ్ర -ధర్మవరం : ప్రస్తుత సమాజంలో విద్యకు వెన్నెముకగా కోచింగ్ అనేది విద్యార్థులను విద్యతో కూడిన నైపుణ్యాన్ని మరింతగా ప్రోత్సహిస్తుందని కరెస్పాండెంట్ భాస్కర్ రెడ్డి, ప్రిన్సిపాల్ హర్షవర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా రేగాటిపల్లి రోడ్డు లోపల వివేకానంద డిగ్రీ కళాశాలలో ఉచిత కోచింగ్ తరగతులకు విద్యార్థుల ద్వారా విశేష స్పందన రావడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తు కోసం మా కళాశాలలో పాలిటెక్నిక్, ఏపీఆర్జేసీ, ఆర్డిటి ప్రవేశ పరీక్షల కోసం ఉచిత బోధనలు అందించడం మాకెంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. పేదరికానికి విద్య అడ్డుకాకూడదన్న ఉద్దేశంతోనే తాము ఉచిత కోచింగ్ సెంటర్లను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, భవిష్యత్తులో మంచి విద్యను అందించుకోవాలని తెలిపారు. వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకొని ఈ ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించడం, ఆసక్తి కల విద్యార్థినీ విద్యార్థులు అందరూ కూడా శిక్షణలో పాల్గొని తమ చదువును మరింత అభివృద్ధి దిశలో వెళ్లేందుకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
కోచింగ్ అనేది విద్యా నైపుణ్యాన్ని మరింత ప్రోత్సహిస్తుంది..
RELATED ARTICLES