మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
ఫిబ్రవరి 5న వైయస్సార్సీపీ ‘ఫీజు పోరు’
కేతిరెడ్డి కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ
విశాలాంధ్ర ధర్మవరం; విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం ఫిబ్రవరి 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను కేతిరెడ్డి తన కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యార్ధులకు సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఫిబ్రవరి 5న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు విద్యార్ధులు, తల్లిదండ్రులతో కలిసి వైయస్ఆర్సీపీ ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు.
ఇప్పటి వరకు రూ.3900 కోట్ల ఫీజులు, స్కాలర్షిప్స్ బకాయి
ఫీజులు చెల్లించక పోవడంతో విద్యార్థులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు.
విద్యార్థులను నానా ఇక్కట్లకు గురి చేస్తున్న విద్యా సంస్థలు
విద్యార్ధుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం దీన్ని వైయస్సార్సీపీ ఏ మాత్రం సహించబోదు అన్నారు. పిల్లలకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి సీనియర్ నాయకులు, నాయకులు, వైఎస్ఆర్సిపి పార్టీ అభిమానులు, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అభిమానులు పాల్గొన్నారు.