Thursday, April 3, 2025
Homeఆంధ్రప్రదేశ్ఏపీకి చల్లని కబురు.. మూడు రోజులపాటు వర్షాలు

ఏపీకి చల్లని కబురు.. మూడు రోజులపాటు వర్షాలు

ఎండలతో అల్లాడిపోతున్న ఏపీ ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. రేపటి నుంచి మూడు రోజులపాటు అంటే సోమవారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, పిడుగులు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది.రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 40 డిగ్రీలు దాటడంతో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడతున్నారు. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో ఆ మేరకు విద్యుత్తు వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో వరుసగా మూడు రోజుపాటు వర్షాలు కురిస్తే వాతావరణం చల్లబడి ప్రజలు ఉపశమనం పొందే అవకాశం ఉంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు