Wednesday, April 2, 2025
Homeతెలంగాణప‌రీక్ష కేంద్రాల‌ను ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్, ఎస్పీ

ప‌రీక్ష కేంద్రాల‌ను ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్, ఎస్పీ

టెన్త్ పరీక్షలు ఇవాళ ఉదయం ప్రారంభమయ్యాయి. అయితే పరీక్ష కేంద్రాలను వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఎస్పీలు పరిశీలించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ పాఠశాలను వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలించారు. శుక్రవారం నుండి ఈ పరీక్షలు ప్రారంభం కాగా.. జిల్లా కేంద్రంలోని ఓ పాఠశాలను ఆయన పరిశీలించారు. పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్లు కానీ, క్యాలిక్యులేటర్ కానీ తీసుకురావద్దని సూచించారు.

జిల్లా పరిషత్ పాఠశాలను పరిశీలించిన ఎస్పీ నారాయణరెడ్డి..
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల కేంద్రంలో గల 10వ తరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి పరిశీలించారు. ఎస్పీతో పాటు డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు. పరీక్ష కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఎటువంటి మాస్ కాఫీయింగ్ జరగకుండా చూడాలని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు