అధికారులకు పలు సూచనలు ఇచ్చిన కలెక్టర్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పలుచోట్ల జిల్లా కలెక్టర్ చేతన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అధికారులకు సంబంధించిన పలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా తొలుత పట్టణములోని పోతుకుంట రోడ్డులో గల నూతన ప్రభుత్వ ఆసుపత్రిని వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యొక్క సేవలు, వాటి ప్రగతి వివరాలను, పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. నేరుగా వ్యాధిగ్రస్తులతో మాట్లాడుతూ ఆసుపత్రి ద్వారా సేవలు ఏ విధంగా అందుతున్నాయి? మందులు పంపిణీ చేస్తున్నారా? అని ఆరా తీశారు. తదుపరి ఆసుపత్రి సూపర్డెంట్ మాధవి ఇప్పటిదాకా 21 మంది రోగులు డయాలసిస్ కోసం నమోదు చేసుకున్నారని ప్రస్తుతం 16 మందికి డయాలసిస్ ను చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డయాలసిస్ మెడికల్ ఆఫీసర్ అభిలాష్, సిబ్బంది పాల్గొన్నారు.
ఈవీఎం గోడౌన్లను తనిఖీ చేసిన కలెక్టర్;; పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు నందు ఉన్న ఈవీఎం యంత్రాలు భద్రపరిచే గోడౌను కలెక్టర్ చేతన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్ కు వేసిన షీలను ఈవీఎంల రక్షణ భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను వారు క్షుణ్ణంగా పరిశీలించారూ. యత్నికర సంగం ఆదేశాల మేరకే ఎప్పటికప్పుడు ఈ తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించి సమితి నివేదికను ప్రభుత్వానికి పంపుతున్నట్లు వారు తెలిపారు. పోలీస్ బందోబస్తు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధుల సమస్యలు ఈ తనిఖీ జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మహేష్, ఎమ్మార్వో నటరాజ్, వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆర్డీవో కార్యాలయాన్ని పరిశీలించిన కలెక్టర్ చేతన్;; పట్టణంలోని ఆర్డీవో కార్యాలయాన్ని కలెక్టర్ చేతన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం పై వారు ఆరాధించారు. ఇందులో పాటించాల్సిన నియమాలు అధికారులు జారీ చేయు స్పీకింగ్ ఆర్డర్స్‌ను కచ్చితంగా దరఖాసుదారునకు అందజేసి పక్కన అనేజ్మెంట్ కూడా పొందపరచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మహేష్ తో పాటు ఎమ్మార్వో నటరాజ్ తదితర అధికారులు పాల్గొన్నారు.