సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్ పిలుపు
విశాలాంధ్ర అనంతపురం : ఈనెల 28న ఆర్.డి.టి. సంస్థ మనుగడపై రాజకీయాలకు అతీతంగా
రౌండ్ టేబుల్ సమావేశానికి తరలి రావాలని మేధావులు, రాజకీయ నాయకులు, సభ్యులు కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి జగదీష్, సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ… సోమవారం స్థానిక జిల్లా పరిషత్ లో ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలోని పలు జిల్లాలలో రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్ (ఆర్ డి టి) చేస్తున్న ప్రజా కార్యక్రమాలు తమరికి తెలియనది కాదన్నారు.
అలాంటి సేవా దృక్పథంతో పనిచేస్తున్న ఆర్డీటి సంస్థకు ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్టు
కింద విదేశాల నుండి వస్తున్న నిధులకు గాను ఎఫ్ సి ఆర్ ఏ ని రెన్యూవల్ చేయనందువల్ల సంస్థ ఆర్థిక కష్టాలతో వారు నిర్వహించే విద్య, వైద్యం, మంచినీటి తదితర పథకాలను నిర్వహించలేకపోతుందన్నారు. రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలు, కులసంఘాలు అందరూ ముక్తకంఠంతో ఆర్డీటికి కేంద్రం మినహాయింపును ఇవ్వాలని అభ్యర్థించవలసిన అవసరం ఉందన్నారు. దయచేసి ఆర్డీటిని కాపాడుకొనుటకు మేధావులు, నాయకులు హాజరై తమ అమూల్యమైన సలహాలు, సూచనలు ఇవ్వవలసినదిగా కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి లు పి నారాయణస్వామి, సి. మల్లికార్జున, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జై రాజారెడ్డి, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి. కేశవరెడ్డి, సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు, నగర సహాయ కార్యదర్శి లు రమణయ్య, అలిపిర , రాప్తాడు నియోజకవర్గం కార్యదర్శి పి. రామకృష్ణ, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.