Wednesday, April 2, 2025
Homeతెలంగాణసునీతా ల‌క్ష్మారెడ్డి పై వ్యాఖ్య‌లు.. విత్ డ్రా చేసుకున్న స్పీకర్

సునీతా ల‌క్ష్మారెడ్డి పై వ్యాఖ్య‌లు.. విత్ డ్రా చేసుకున్న స్పీకర్

తెలంగాణ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని నారాయణఖేడ్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. స్పీకర్‌ స్థానంలో ఉన్న మీరు అలా మాట్లాడటం బాధకరమన్నారు. తాను ఏం తప్పు చేశానని, మీకు ఎందుకు అలా వినాలనిపించలేదని స్పీకర్‌ను ఆమె ప్రశ్నించారు. విషయంపైనే మాట్లాడాను తప్ప ఎక్కడా పరిధి దాటలేదని గుర్తు చేశారు. అయినా వినబుద్ధికావడం లేదని ఎలా అంటారన్నారు. తనపై వ్యాఖ్యలను స్పీకర్‌ ఉపసంహరించుకోవాలని కోరారు. శాసనసభలో సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ాాసభ్యుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్‌పైనే ఉంటుంది. నిన్న మీరు అన్నటువంటి మాటలు చాలా బాధాకరం. తాను మాట్లాడుతున్న సందర్భంలో సబ్జెక్టు నుంచి ఎక్కడా డీవియేట్‌ కాలేదు. మహిళలు, శిశు సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ సమస్యలపై మాట్లాడుతానని ముందే సమాచారం ఇచ్చాను. అవకాశం కోసం సాయంత్రం వరకు నిరీక్షించా. రాత్రి 8 గంటలకు మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. రెండు నిమిషాల్లో పూర్తిచేయాలని సూచించారు.ాా

మిమ్మల్ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదు
స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ మాట్లాడుతూ.. మహిళలంటే తనకు ఎనేలని గౌరవం ఉందన్నారు. తనకు 8 మంది సోదరీమణులు ఉన్నారని, మహిళలను గౌరవిస్తానని చెప్పారు. ామిమ్మల్ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదు. తాను ఈ సీటు మీద ఉండి తమను అన్నానని అనుకోవడం చాలా పొరపాటు. మీరు మాట్లాడేటప్పుడు ఇరువైపుల నుంచీ రన్నింగ్‌ కామెంట్ వస్తోంది. దీంతో వారు మాట్లాడేది నాకే వినబుద్ధి అవుతలేదు. మీకు వినబడుతున్నదా అని అన్నాను. మిమ్మల్ని ఉద్దేశించి అలా అనలేదు. మీ మనసు కష్టపడితే ఆ వ్యాఖ్యలను విత్‌డ్రా చేసుకుంటున్నాను.్ణ అని చెప్పారు.

బీజేపీ వాయిదా తీర్మానం
హైద‌రాబాద్ ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యంలో ఆంక్ష‌లు విధించ‌డంపై అసెంబ్లీలో చ‌ర్చించాల‌ని బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ మేర‌కు అసెంబ్లీ కార్య‌ద‌ర్శికి లేఖ అంద‌జేసింది. విద్యార్థుల ప్రజాస్వామిక హక్కులను హరించే విధంగా ఉంద‌ని పేర్కొన్నారు. ర్యాలీలు, ధర్నాలు, నిరసనలపై నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తున్నామని ఆ పార్టీ తెలిపింది. దీనిపై శాసనసభలో చర్చించాలని ప్రతిపాదించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు