ఏపీలోని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండల పరిధిలోని గుండాలకోనలో ఉన్న శివాలయానికి మహా శివరాత్రి సందర్భంగా 14 మంది భక్తులు సోమవారం రాత్రి కాలినడకన అటవీ మార్గంలో వెళ్తున్న సమయంలో ఏనుగుల గుంపు వారిపై దాడి చేసింది. ఈ ఘటనలో ఐదుగురు భక్తులు చనిపోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటనపై తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. అటవీ శాఖ అధికారులను ఈ ఘటన గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 5లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అటవీ ప్రాంతాల్లో ఉన్న శివాలయాలకు వెళ్లే భక్తులకు తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని పవన్ అధికారులను సూచించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను పరామర్శించి ధైర్యం ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యేలను కోరారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
ఏనుగుల దాడిలో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం: డిప్యూటీ సీఎం పవన్
RELATED ARTICLES