ఏ పి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సి మల్లికార్జున పిలుపు
విశాలాంధ్ర అనంతపురం : 90 శాతం విత్తన వేరుశనగ అన్ని రకాల విత్తనాలు పంపిణీ చేయాలి కోరుతూ ఈనెల 26న జిల్లా కలెక్టర్ వద్ద నిర్వహిస్తున్న ధర్నాను జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మల్లికార్జున పిలుపు నిచ్చారు. శుక్రవారం సిపిఐ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిరుతల . మల్లికార్జున మాట్లాడుతూ… జిల్లావ్యాప్తంగా ముందస్తుగా కురుస్తున్న వర్షాలతో రైతు భూములను దుక్కులు చేసుకుని విత్తనాలకు సిద్ధమవుతున్నారన్నారు. ప్రభుత్వం రైతులకు సబ్సిడీతో అందించే వేరుశెనక్కాయలు ఇంతవరకు వ్యవసాయ గోడౌన్ నందు సిద్ధం చేయలేదన్నారు. సకాలంలో వర్షాలు కురుస్తున్నందున మండల పరిధిలోని అన్ని రైతు సేవా కేంద్రాలలో అన్ని రకాల విత్తనాలు 90% సబ్సిడీతో రైతులకు ఇవ్వాలన్నారు. ఎకరాకు మూడు బస్తాలు వేరుశనగ కాయలు అందించాలన్నారు . గతంలో వేరుశనగ పంట సాగు చేసి సకాలంలో వర్షాలు కురవక రైతులు తీవ్రంగా నష్టపోయారున్నారు. రైతుల దగ్గర డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా వారిని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. విత్తన శుద్ధి మందులను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇస్తానన్న అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఇస్తామన్న 20 వేల రూపాయలు ఒకేసారి రైతులకు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వి. టి. రామాంజనేయులు, పండ్లతోటల రైతు సంఘం జిల్లా నాయకులు వి.కె. కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.