Wednesday, December 4, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించండి.. ఆర్డిఓ మహేష్

సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించండి.. ఆర్డిఓ మహేష్

విశాలాంధ్ర -ధర్మవరం: సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలను పగడ్బందీగా పటిష్టంగా నిర్వహించాలని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సాయి నగర్ లో గల శ్రీ శిరిడి సాయిబాబా కళ్యాణ మండపంలో డివిజన్ పరిధిలోని ఏడు మండలాల ఎన్నికల అధికారులకు,ఉప ఎన్నికల అధికారులకు, పోలింగ్ అధికారులు, సహాయక అధికారులు ఎన్నికల నిర్వహణపై ఒకరోజు శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ శిక్షణా తరగతులలో ఆర్డీవో తో పాటు ఇరిగేషన్ డియి. మహేశ్వర్ రెడ్డి, ఇరిగేషన్ ఏఈ. గురు ప్రసాద్ లు పాల్గొన్నారు. అనంతరం ఆర్డిఓ మహేష్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డివిజన్ పరిధిలోని 46 నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలకు సంసిద్ధం కావాలని తెలిపారు. ఒకే రోజు రెండు దఫాలుగా ఈ శిక్షణా తరగతులను నిర్వహించినట్లు వారు తెలిపారు. ఎన్నికలు జరుగు రోజున ఎటువంటి పొరపాట్లకు చోటు ఇవ్వరాదని, తప్పిదాలకు అవకాశం ఉండరాదని, ప్రభుత్వా నియమ నిబంధనల ప్రకారం నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల విషయంలో పగడ్బందీగా అందరూ తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. విధి విధానాలను కూడా తెలియపరచడం జరిగిందని వారు తెలిపారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఆయా పోలింగ్ బూతుల వద్ద విధులను సక్రమంగా నిర్వహించాలని తెలుపుతూ సూచనలు, సలహాలు, మార్గదర్శకం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఎన్నికల తేదీలు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రచురించబడుతుందని తెలిపారు. ఎన్నికల్లో పోటీదారుడు ఆ ప్రాదేశిక నియోజకవర్గం ఓటర్ అయి ఉండాలని, 18 సంవత్సరాలు వయసు ఉండాలని, ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండరాదని, ఏదేని చట్టబద్ధమైన హోదా కలిగి ఉండకూడదని, క్రిమినల్ చట్టాల ప్రకారం దోసి అయి ఉండకూడదని, నీటి శిస్తూ ఎగవేత దారుడు అయి ఉండరాదని, దివాలా తీసి ఉండకూడదని తెలిపారు. ఆశావాహు అభ్యర్థులు సమర్పించిన నామినేషన్లను పరిశీలన చేయాలని తెలిపారు. తదుపరి మరిన్ని వివరాలను తెలియపరచడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని ఏడు మండలాల నుండి 600 మంది శిక్షార్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు