Thursday, January 16, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపేద ప్రజల కొరకే ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహణ..

పేద ప్రజల కొరకే ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహణ..

స్పందన ఆసుపత్రి.. డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణము, గ్రామీణ ప్రాంతాలలో గల పేద ప్రజల కొరకే ఉచిత గుండె వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు స్పందన ఆసుపత్రి అధినేతలు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్పందన హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈ ఉచిత గుండె వైద్య శిబిరాన్ని కేవలం పేదల కొరకే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత సమాజంలో గుండెపోటుతో ఎంతోమంది వయస్సుతో నిమిత్తం లేకుండా మృతి చెందడం జరుగుతోందని తెలిపారు. ఇటువంటి సమయాలలో గుండె పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలతో పాటు అందించుకోవలసిన వైద్య చికిత్సల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అందుకే ఈ ఉచిత గుండె వైద్య శిబిరమును ఈనెల 17వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు పట్టణంలోని సాయి నగర్ లో (బాబా గుడి వద్ద) స్పందన హాస్పిటల్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరానికి వచ్చువారు మాస్కు తప్పనిసరిగా ధరించి రావాలని తెలిపారు. ఈ శిబిరంలో జి ఆర్ బి ఎస్, బిపి, ఈసీజీ, 2 డి ఎకో ఉచితంగా నిర్వహించబడును అని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యమును పదిలంగా ఉంచుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు