అనంతపురం జిల్లా, విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలోని డిఎస్పి కార్యాలయం వద్ద శనివారము దూదేకుల సేవా సంఘం అధ్యక్షుడు పెయింటర్ భాష ఆధ్వర్యంలో ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరికి శాలువా కప్పి పూలమాలవేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏఎస్పి రోహిత్ కుమార్ చౌదరి మాట్లాడుతూ సమాజంలో కుల సంఘాలు తమ కుల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉంటాయి. అంతేకాకుండా తమ చుట్టూ అసాంఘిక కార్యకలాపాలు ఏమైనా తెలిసిన, చూసిన వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు. అలాగే తమ సంఘంలో కానీ, ఇంటి వద్ద కానీ ఏవైనా చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు క్షణిక ఆవేశానికి లోనై గొడవలు చేసుకోకుండా తమ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి స్టేషన్లో ఫిర్యాదు చేయండి అన్నారు. దీంతో తమ సమస్యను పోలీసుల పరిష్కరిస్తారు. అట్లా కాకుండా తగువులాడారంటే ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుని మనశ్శాంతి లేకుండా సమస్యల పాలవుతారన్నారు. కావున శాంతియుతంగా జీవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దూదేకుల సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ఘనంగా ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరికి సత్కారం
RELATED ARTICLES