Tuesday, April 1, 2025
Homeఆంధ్రప్రదేశ్నవోదయ ప్రవేశపరీక్షలో సీటు సాధించిన సింధుకు అభినందన కార్యక్రమం

నవోదయ ప్రవేశపరీక్షలో సీటు సాధించిన సింధుకు అభినందన కార్యక్రమం

విశాలాంధ్ర -వలేటివారిపాలెం : 2025 లో జరిగిన నవోదయ ప్రవేశ పరీక్ష లో సీటు సంపాదించిన మా పాఠశాల ఎంపీయూపీ పాఠశాల తూర్పు పోలినేనిపాలెం విద్యార్థిని బూదాల సింధు కు అభినందన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ఎంఈఓ మల్లికార్జున మరియు గ్రామ పెద్దలు విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాశాఖాధికారి శ్రీ అద్దంకి మల్లిఖార్జునరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు నవోదయ సీటు సంపాదించి తల్లిదండ్రులు (బూదాల సింహాద్రి -పుష్పలత )కు పాఠశాలకు మంచి పేరు తెచ్చారని తెలిపారు. గ్రామ పెద్దలు మాదాల రమణయ్య మాట్లాడుతూ పాఠశాలలు అభివృద్ధికి తామంతా కృషి చేస్తామని తెలిపారు. నవోదయ సీటు సాధన కోసం పి.గోపాల్ సార్ కృషి అభినందనీయం అని అన్నారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జంగాల నిర్మలా దేవి, ఉపాధ్యాయులు,ఎస్ ఎం సీ చైర్మన్ పొదిలి వెంకటేశ్వరి, మరియు గ్రామ పెద్దలు బూదాల సింధు కు అభినందనలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు